రేపటి భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2020-12-07T05:09:41+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాల కోఆర్డినేషన్‌ పిలుపులో భాగంగా ఈ నెల 8న నిర్వహించే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ఐక్య రైతు ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

రేపటి భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఐక్య రైతు ప్రజాసంఘాల నాయకులు

 నల్లగొండ రూరల్‌ / మిర్యాలగూడ / దేవరకొండ / దామరచర్ల / మాడ్గులపల్లి, డిసెంబరు 6 : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాల కోఆర్డినేషన్‌ పిలుపులో భాగంగా ఈ నెల 8న నిర్వహించే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ఐక్య రైతు ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి కొమురయ్య భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం, జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు కే.పర్వతాలు,  జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడారు.  కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే జాతీయ రైతు సంఘాల కోఆర్డినేషన్‌ కమిటీ పిలుపులో భాగంగా జరిగే దేశవ్యాప్త భారత్‌ బంద్‌తో పాటు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.    రైతాంగ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత రైతా ంగ ఐక్యకార్యాచరణ మోర్చా ఈ నెల 8న చేపట్టిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న చేస్తున్న లక్షలాది మంది రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. రైతాంగ ఉద్యమంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిర్భందకాండను ఖండిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కుంటిగోర్ల నాగరాజు కోరారు. ఆదివారం ఆయన దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నూతన వ్యవసాయ చ ట్టాలు రద్దు చేయాలని కోరుతూ చేపట్టనున్న దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి లావూడ్య ఎర్రానాయక్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో జడ్పీ కోఆప్షన్‌ స భ్యుడు మహ్మద్‌ మోసిన్‌అలీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య మాట్లాడుతూ భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎ్‌స పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.

Updated Date - 2020-12-07T05:09:41+05:30 IST