ఓటమి భయంతోనే బీజేపీపై విమర్శలు : సాధినేని

ABN , First Publish Date - 2020-11-21T06:25:57+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఓటమి భయంతోనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు సాధినేని శ్రీనివాసరావు విమర్శించారు.

ఓటమి భయంతోనే బీజేపీపై విమర్శలు : సాధినేని
సమావేశంలో మాట్లాడుతున్న సాధినేని శ్రీనివాస్‌రావు

మిర్యాలగూడ టౌన్‌, నవంబరు 20 : సీఎం కేసీఆర్‌ ఓటమి భయంతోనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు సాధినేని శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన  పార్టీ సమావేశంలో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికలో పరాజయాన్ని జీర్ణి ంచుకోలేక పోతున్న టీఆర్‌ఎస్‌ మంత్రులు దినదినాభివృద్ధి చెందుతున్న బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారన్నారు. దేశానికీ, రాష్ట్రానికీ బీజేపీ చేసింది, చేస్తున్నదేమిటో ప్రజలందరికీ తెలుసని, అందుకే రాష్ట్ర ప్రజలు కమలం గుర్తుని అభిమానిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశానికి హాజరైన పట్టణ ఇన్‌చార్జి యాదగిరిచారి నూతనంగా ఎన్నికైన పట్టణ కార్యవర్గానికి ప లు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్‌, అధ్యక్షుడు దొండపాటి వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ చిలుకూరి రమాదేవి, రేపాల పురుషోత్తంరెడ్డి, రతన్‌సింగ్‌నాయక్‌, కమలాకర్‌రెడ్డి, శ్యాం, గోపీనాథ్‌, గిరి, సరితాశేఖర్‌, పోరెడ్డి శ్రీను, సీతారాంరెడ్డి పాల్గొన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉంటా..

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చిలుకూరి రమాదేవి అన్నారు. వార్డులో పర్యటించిన ఆమె కల్యాణలక్ష్మి  పథకం కింద మంజూరైన లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారురాలికి అందిం చారు. కార్యక్రమంలో శ్యాం, వెంకటేష్‌, లత, ఊర్వశి పాల్గొన్నారు.

Read more