‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ’

ABN , First Publish Date - 2020-12-06T04:50:17+05:30 IST

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి బీజేపీ రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన అన్నారు.

‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ’
కోదాడలో విజయోత్సవ సంబరాల్లో బీజేపీ శ్రేణులు

 కోదాడ టౌన్‌, డిసెంబరు 5 :  వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి బీజేపీ రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలో గత ఎన్నికల కన్నా ఎక్కువ స్థానాలు సాధించడంతో శనివారం సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మిఠా యిలు  పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజు, కృష్ణయ్య, యశ్వంత్‌, రమేష్‌, నారాయణ, సతీష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.


గరిడేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అందె కోటయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ పోకల వెంకటేశ్వర్లు, సుందరి రమేష్‌, బెల్లంకొండ ఉపేందర్‌ పాల్గొన్నారు. 


తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో బొల్లు మల్లయ్య, నాయకులు సోమయ్య, క్రిష్ణమూర్తి, క్రిష్ణ పాల్గొన్నారు.


తుంగతుర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు.  బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకినేని రవీందర్‌రావు, నాయకులు సాయిబాబా, మహేందర్‌, పద్మ, నరేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.


నేరేడుచర్లలో బీజేపీ నాయకులు నేరేడుచర్లలో మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో నాయకులు పార్తనబోయిన విజయ్‌కుమార్‌, రామినేని కృష్ణయ్య, వీరబాబు పాల్గొన్నారు.


ఆత్మకూర్‌(ఎస్‌)లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ  నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, తోట ప్రభాకర్‌, మాధవరెడ్డి, కృష్ణ, రాంచంద్రు పాల్గొన్నారు. 


నూతనకల్‌లో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2020-12-06T04:50:17+05:30 IST