సంజయ్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు : బీజేపీ

ABN , First Publish Date - 2020-11-03T10:33:48+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు కోదాడ సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వినాయక దేవాలయంలో

సంజయ్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు : బీజేపీ

కోదాడ టౌన్‌, అక్టోబరు 2: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు కోదాడ సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వినాయక దేవాలయంలో పూజలు నిర్వహించారు. బీజేపీ నేతల అరెస్టులు శోచనీమన్నారు. కార్యక్రమంలో నూనె సులోచన, కృష్ణయ్య, యశ్వంత్‌, శ్రీనివాసరావు, పిచ్చయ్య, గణేష్‌, ఉదయ్‌, సతీష్‌, శైలజ, వెంకట్‌, సురేష్‌, మతిన్‌, నరేష్‌ పాల్గొన్నారు.

 

హుజూర్‌నగర్‌ : బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం శోచనీయమని బీజేపీ యువమోర్చా జిల్లా నాయకులు గోపీనాథ్‌ అన్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి మాట్లాడారు. ముందస్తు అరెస్టులు చేయడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో రవి, సతీష్‌ రంగనాథ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T10:33:48+05:30 IST