ద్విచక్రవాహనం చోరీ.. సీసీకెమెరాలో రికార్డు

ABN , First Publish Date - 2020-12-13T05:40:41+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్‌ రోడ్డులో ఈనెల 10న ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి.

ద్విచక్రవాహనం చోరీ.. సీసీకెమెరాలో రికార్డు

మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 12: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్‌ రోడ్డులో ఈనెల 10న ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా బాధితుడు టూటౌన్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. స్థానిక విజయలక్ష్మి ట్రేడర్స్‌లో సమాగ్రి కొనుగోలు చేసేందుకు ప్లంబర్‌ వర్కర్‌ నిరంజన్‌ సమీపంలోని చేనేత సహకార సంఘం భవన ఆవరణలో బైక్‌ పార్క్‌ చేశాడు. గమనించిన గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ హ్యాండ్‌లాక్‌ తీసి వాహనంతో ఉడాయించాడు. దుకాణంలో సామాగ్రి తీసుకొని బయటకొచ్చి గమనించగా వాహనం కనిపించకపోవడంతో బాధితుడు అక్కడి దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించాడు. టూటౌన్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. బైక్‌చోరీకి పాల్పడిన యువకులు పక్షం రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని శ్రీకాంత్‌ కిరాణషాపులో నగదుతోపాటు కొంత నగదును ఆపహరించుకెళ్లినట్లుగా సీసీటీవీ రికార్డులు బహిర్గతం కావడంతో సదరు వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


Updated Date - 2020-12-13T05:40:41+05:30 IST