బైక్‌ నుంచి జారి పడి వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-12-11T06:52:21+05:30 IST

ప్రమాదవశాత్తు బైక్‌ నుంచి జారిపడి వివాహిత మృతి చెందింది. ఈ ఘటన గురువారం lమునుగోడు మండలం సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది.

బైక్‌ నుంచి జారి పడి వివాహిత మృతి

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారంలో ఘటన

మునుగోడు రూరల్‌, డిసెంబరు 10 : ప్రమాదవశాత్తు బైక్‌  నుంచి జారిపడి వివాహిత మృతి చెందింది.  ఈ ఘటన గురువారం  lమునుగోడు మండలం  సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. సింగారం గ్రామానికి చెందిన  రాంరెడ్డి కుమార్తె మల్లె మౌనిక(30) కు యాదాద్రి భువనగిరి జిల్లా గుజ్జ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. మౌనిక అనారోగ్యంతో కొంతకాలంగా పుట్టినిల్లు సింగారంలో ఉంటూ మునుగోడులో చికిత్స పొందుతోంది.   ఈ క్రమంలో తండ్రితో  బైక్‌పై వెళుతుండగా గ్రామశివారులో ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. . మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T06:52:21+05:30 IST