భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-11T05:48:36+05:30 IST
అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి శివారులో హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై ముం దస్తు సమాచారంతో హైదరాబాద్ నగరం నుంచి జనగామ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 1792 జిలిటెన్ స్టిక్స్, 1600 డిటోనేటర్స్‌ను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన కాంట్రాక్టర్ కందాడి వెంకటరెడ్డి, జనగామ జిల్లా దేవరుప్పుల మం డలం పెద్దమడూరుకు చెందిన వాంగ్‌డోతు భాస్కర్‌ను అరెస్టు చేశారు. డిట నేటర్లు, జిలిటన్ స్టిక్స్ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న యానాల పాండురంగారెడ్డి, యానాల భూపాల్‌రెడ్డి, శ్రీను, వెంకట్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.