చోరీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా
ABN , First Publish Date - 2020-12-11T05:40:55+05:30 IST
ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ భువనగిరి ప్రథమశ్రేణి న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు.
యాదాద్రి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ భువనగిరి ప్రథమశ్రేణి న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. భువనగిరి డీసీపీ కె. నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... 2019 డిసెంబరు22వ తేదీన భువనగిరి పట్టణంలోని టీచర్‌కాలనీలో కె. సతీష్ కుమార్ ఇంటికి తాళం వేసి తిరుపతి తీర్థయాత్రలకు వెళ్లగా సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన పొన్నాల శివశంకర్, ఇండ్ల సోమ శంకర్ ఆ ఇంటి తాళం పగులగొట్టి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.