భారత్‌బంద్‌కు బీసీల సంపూర్ణ మద్దతు:

ABN , First Publish Date - 2020-12-07T05:42:51+05:30 IST

రైతు సంఘాల పిలుపు మేరకు నిర్వ హించే భారత్‌ బంద్‌కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలకేంద్రంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

భారత్‌బంద్‌కు బీసీల సంపూర్ణ మద్దతు:
నల్లగొండ జిల్లా మునుగోడులో మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  శ్రీనివాస్‌గౌడ్‌

మునుగోడు, డిసెంబరు 6:రైతు సంఘాల పిలుపు మేరకు నిర్వ హించే భారత్‌ బంద్‌కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా  ఆదివారం నల్లగొండ జిల్లా  మునుగోడు మండలకేంద్రంలోని  బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళుర్పించారు.  ఈసందర్భంగా ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక హామీ లతో గద్దెనెక్కిన పాలకపక్షాలు ఆచరణలో విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మ ద్దతు ధర లభించనందున  రైతులు అప్పులతో సతమతమవుతు న్నారన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో రైతులను మరింత  ఇబ్బంది పెట్టేవిధంగా నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకురా వడం శోచనీయమన్నారు. ఇప్పటికే అన్నివర్గాల రైతలు తీవ్ర ఆం దోళనతో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  ప్రభుత్వాలు నెరవేర్చాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో  సర్పం చ్‌ మిర్యాల వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుం టోజు వెంకటాచారి,  బొడ్డు నాగరాజుగౌడ్‌, రేవెల్లి మల్లేష్‌, యాద ప్ప, కైలాసం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T05:42:51+05:30 IST