పోచంపల్లిలో ఎంగిలి పువ్వు బతుకమ్మ
ABN , First Publish Date - 2020-09-18T07:02:58+05:30 IST
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి

భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 17: తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను వాడల్లోని ప్రధాన కూడలి వద్దకు చేర్చి మహిళలు ఆడుతూ, పాడుతూ బతుకమ్మ ఆడారు. గాంధీనగర్, పద్మశాలి సభావేదిక, కేకే స్ట్రీట్, ప్రగతినగర్, వివేకానంద యువజన సంఘం, లక్ష్మణ్‌నగర్, భా వనారుషిపేట, మాధవనగర్, భద్రావతీనగర్, పద్మానగర్, రాంనగర్, మార్కండేయనగర్ కాలనీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో మునిసిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, కౌన్సిలర్ కుడికాల అఖిల తదితరులు పాల్గొన్నా రు. కాగా, మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గురువారం బతుకమ్మ ఆడగా, మిగ తా ప్రాంతా ల్లో వచ్చేనెల 17న బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్నాయి.