బతికిస్తాం..

ABN , First Publish Date - 2020-11-25T06:03:10+05:30 IST

నేరేడుచర్ల పట్టణంలోని రావిచెట్టును కాపాడేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’లో ‘బతకాలని ఉంది’ శీర్షినక కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు.

బతికిస్తాం..

రావి చెట్టు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సిద్ధమవుతున్న అధికారులు

నేరేడుచర్ల, నవంబరు 24: నేరేడుచర్ల పట్టణంలోని రావిచెట్టును కాపాడేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’లో ‘బతకాలని ఉంది’ శీర్షినక కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు. రావిచెట్టును తొలగింపు పనులను అటవీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేయించారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానికుల నుంచి ఒత్తిడి రావడంతో అటవీ అధికారులు స్పందించారు. రావిచెట్టును వేరే ప్రాంతానికి తరలించి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో నాటేందుకు సిద్ధం చేయాలనే అలోచనతో అటవీ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇప్పటికే వారికి అనుమతులువచ్చాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడికి తరలించాలి? అనేదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.  ఇదిలా ఉండగా, రావిచెట్టు విషయాన్ని వాటర్‌ ఫౌండేషన్‌ సంస్థ నిర్వాహకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు కావాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని హుజూర్‌నగర్‌ అటవీ రేంజ్‌ అధికారి నట్టె శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. చెట్టును ఎక్కడికి తరలించి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-11-25T06:03:10+05:30 IST