పరిహారంకోసం ‘బస్వాపూర్’ పనుల అడ్డగింత
ABN , First Publish Date - 2020-12-15T06:35:45+05:30 IST
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు.
భువనగిరి రూరల్, డిసెంబరు 14: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు. బస్వాపురం రెవెన్యూ పరిధిలో 94 ఎకరాల్లో 56 మంది రైతులు సీలింగ్ భూమిలో సాగు చేసుకొని కబ్జాలో ఉన్నారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆయా భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి మట్టిని తవ్వుతుండగా నిర్వాసిత రైతులు పనులను అడ్డుకొని కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. తమకు పరిహారం అందజేసిన అనంతరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతులు ఉడుత విష్ణు, మచ్చ వెంకటనర్సు, నరాల మల్లేశం ఉన్నారు.