నేటి నుంచి మధ్యాహ్నం వరకే బ్యాంకులు

ABN , First Publish Date - 2020-03-24T11:55:17+05:30 IST

కరోనా వైరస్‌ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా బ్యాంకు సేవలు సమధ్యాహ్న వరకే ఉంటాయిన కలెక్టర్‌

నేటి నుంచి మధ్యాహ్నం వరకే బ్యాంకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 23:  కరోనా వైరస్‌ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా బ్యాంకు సేవలు సమధ్యాహ్న వరకే ఉంటాయిన కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల బ్యాంకు లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్న 2గంటలకు మాత్రమే పని చేస్తాయ ని తెలిపారు. ఏటీఎంల వద్ద కూడా శానిటైజర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాంకుకు వచ్చేవారికి గేటు వద్దనే స్ర్కీనింగ్‌ చేయాలని సూచించారు.

Read more