భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-07T05:31:04+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ నెల 8వ తేదీన జరిగే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు కోరారు.

భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలి
సూర్యాపేటలో మాట్లాడుతున్న నాయకులు

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 6: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ నెల 8వ తేదీన జరిగే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్‌ భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్‌కుమార్‌, మాండ్ర మల్లయ్య, కొత్తపల్లి శివకుమార్‌, బుద్ద సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, లింగయ్య, మట్టిపెల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన సమావేశంలో అఖిలపక్షాల నాయకులు కె.సూర్యనారాయణ, దొంగరి వెంకటేశ్వర్లు, నాగారపు పాండు మాట్లాడారు. సమావేశంలో పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, తండు సాయిరామ్‌, ము ల్కలపల్లి సీతయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, రమేష్‌, తిరుపతయ్య, ఎలక వెంకటేశ్వర్లు, ఇందిరాల వెంకటేశ్వర్లు, రమేష్‌, శేషగిరిరావు పాల్గొన్నారు. తిరుమలగిరిలో సమావేశంలో కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై. నరేష్‌, కౌన్సిలర్లు మొగుళ్ల జితేందర్‌, భాస్కర్‌, పాల్గొన్నారు. చింతలపాలెంలో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు గూలాంహూస్సేన్‌, ఉదయ్‌కుమార్‌, షేక్‌ నబిరసూల్‌, గోపి, పాపిరెడ్డి పాల్గొన్నారు. మఠంపల్లిలో జరిగిన సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి భూక్యపాండునాయక్‌, మాలోతు బాలునాయక్‌, వినో ద్‌, వాలిబాయి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నడిగూడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనా రాయణ మాట్లాడారు. కేంద్రం తీరుపట్ల రైతులు చేపట్టిన ఆందోళనకు స్పందిం చని తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. 

Updated Date - 2020-12-07T05:31:04+05:30 IST