బల్దియా విజయోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-05T05:52:01+05:30 IST
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా వ్యవహరించిన చందానగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంజులరఘునాఽథన్‌రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఆలేరులో విజయోత్సవాలు చేసుకున్నారు.
ఆలేరు, డిసెంబరు 4: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా వ్యవహరించిన చందానగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంజులరఘునాఽథన్‌రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఆలేరులో విజయోత్సవాలు చేసుకున్నారు. స్థానిక రైల్వే గేట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మునిసిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ వైస్‌చైర్మన్ గ్యాదపాక నాగరాజు, నాయకులు చింతకింది మురళి, మల్లేశ్, మామిడాల భాను, రమణారెడ్డి, బాలస్వామి, శ్రీకాంత్‌నాయక్, గిరిరాజు వెంకటయ్య, జెల్లి నర్సింహులు, జమాల్, జూకంటి ఉప్పలయ్య, సీస రాజేశ్, మజహర్ పాల్గొన్నారు. ఆగా ఆలేరులో బీజేపీ నాయకులు కూడా బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్, ప్రధాన కార్యదర్శులు పులి పలుకుల మహేశ్, బందెల సుభాష్, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్ సంగు భూపతి, నాయకులు కావడి సిద్దిలింగం పాల్గొన్నారు.
ఉప్పల్ కార్పొరేటర్ రజితకు కుంభం అభినందనలు
యాదాద్రి, (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎం.రజితా పరమేశ్వర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ డివిజన్ ప్రచార భాద్యతలు నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారీటీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు, గెలుపుకు పాటుపడిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, భువనగిరి మునిసిపల్ ప్లోర్‌లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
బీజేపీ సంబురాలు
భువనగిరి టౌన్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు భువనగిరిలో విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్య క్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు ఉన్నారు.