ఆటో, బైక్ ఢీ: ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-11-21T06:09:43+05:30 IST
ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది.

సంస్థాన్ నారాయణపురం, నవంబరు20: ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌కు చెందిన కోక విష్ణు(33) తాపీమేస్త్రీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం బైకుపై రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు వెళ్తుండగా, మంచాల మండలం నుంచి సంస్థాన్ నారాయణపురానికి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. విష్ణు తలకు తీవ్ర గాయాలు కావడంతో, అక్కడికక్కడే మృతిచెందాడు. విష్ణుకు భార్య, కుమారుడు ఉన్నారు.