‘అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

ABN , First Publish Date - 2020-05-17T10:01:26+05:30 IST

గిరిజన ఉద్యోగి పాపారావును బెదిరించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐక్య ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

‘అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

నల్లగొండ క్రైం, మే 16: గిరిజన ఉద్యోగి పాపారావును బెదిరించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐక్య ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నల్లగొండ డీఎస్పీకి శనివారం వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపారావును ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో సాక్ష్యంగా తీసుకుని సుమోటోగా భావించి కేసు నమోదు చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘాల నాయకులు నూనె వెంకటస్వామి, బకరం శ్రీనివాస్‌, మానుపాటి భిక్షం, పాలడుగు నాగార్జున, పన్నాల గోపాల్‌రెడ్డి, గోలి సైదులు, ఎన్నమల్ల అనిల్‌కుమార్‌, అల్లె పరమేష్‌, బొజ్జ దేవయ్య, శంకర్‌, పెరిక అంజి, నలపరాజు సైదులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-05-17T10:01:26+05:30 IST