ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసిన పైలం
ABN , First Publish Date - 2020-12-15T06:30:57+05:30 IST
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసిన పైలం సంతోష్ సేవలు మరువరానివని తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం రాత్రి నకిరేకల్‌లో నిర్వహించిన పైలం సంతోష్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నకిరేకల్, డిసెంబరు 14: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసిన పైలం సంతోష్ సేవలు మరువరానివని తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం రాత్రి నకిరేకల్‌లో నిర్వహించిన పైలం సంతోష్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై సంతోష్ అనేక పాటలు రాసి ప్రజలను ఉత్తేజపర్చారన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే సంతోష్ కళాకారు డిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యం చేశార న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత సంతోష్‌కే దక్కిందన్నారు. సభలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభ య్య, కళా కారుడు సాయిచంద్, వేముల నరేష్, పుష్ప, రాయి కృష్ణ, కప్పల వసంత, నిర్మల పలువురు కళాకారులు పాల్గొన్నారు.