ఆస్తుల నమోదును వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-10-07T11:09:14+05:30 IST
పట్టణాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. భువనగిరి మునిసిపాలిటీ

కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి టౌన్/ మోత్కూరు/ ఆత్మకూరు(ఎం)/భువనగిరి రూరల్/ సంస్థాన్‌నారాయణపురం: పట్టణాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. భువనగిరి మునిసిపాలిటీ హెచ్‌బీకాలనీలో ఆస్తుల నమోదును మంగళవారం ఆమె పరిశీలించారు. ఆస్తుల నమోదుకు వచ్చే సిబ్బందికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు చూపించాలని ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానాల నివృత్తికి మునిసిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ ఉన్నారు. మోత్కూరులో ఇంటింటి సర్వేను మునిసిపల్ చైర్‌పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, కమిషనర్ పి.మనో హర్‌రెడ్డి పరిశీలించారు. ఆత్మకూరు(ఎం)తో పాటు తిమ్మాపురం, పారుపల్లి గ్రామాల్లో సర్వేను డీపీవో సాయిబాబ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏ.రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచులు జె.నగేష్, లగ్గాని రమేష్, కె.రాంరెడ్డి, కార్యదర్శులు శ్రీనివా్‌సరెడ్డి, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భువనగిరి మండలం పచ్చర్లబోర్డుతండా, రెడ్డినాయక్‌తండా, సూరెపల్లి, ఆకుతోట బావితండాలో నిర్వహిస్తున్న సర్వేను ఎంపీడీవో నాగిరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు రెడ్డినాయక్, మంజీనాయక్, సక్కమ్మ, బి. లక్ష్మమ్మ పాల్గొన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలం మహ్మదాబాద్, వెంకమ్ బావి తండా, నారాయణపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తుల సర్వేను జడ్పీసీఈవో కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా త్వరితగతిన సర్వేను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి ప్రేమ్ చందర్‌రెడ్డి, ఎంపీడీవో జలేందర్‌రెడ్డి, ఎంపీవో శశికళ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.