భూవివాదంపై ఏఎస్పీ విచారణ
ABN , First Publish Date - 2020-07-10T11:14:50+05:30 IST
మండలంలోని కోతులారం గ్రామాన్ని ఏఎస్పీ నర్మద, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు.

మునుగోడు / మునుగోడు రూరల్, జూలై 9 : మండలంలోని కోతులారం గ్రామాన్ని ఏఎస్పీ నర్మద, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. కొన్నాళ్లుగా ఆగ్రామంలో శ్రీపతిపంతులు వెంకటేశ్వరరావు కుమారులతో పాటు గ్రామానికి చెందిన కొందరు రైతుల మధ్య నెలకొన్న భూవివాదం విషయమై ఇరువర్గాలతో పాటు గ్రామస్థులను వివారాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సదరు భూవివాదానికి సంబంధించి ఇరువర్గాలను స్థానిక పోలీ్సస్టేషన్లో విచారించారు. ఏఎస్పీ వెంట తహసీల్దార్ దేశ్య, ఎస్ఐ రజినీకర్ ఉన్నారు.