ఆర్య వైశ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-19T05:51:56+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్ని కల్లో ఆర్యవైశ్యులకు ఎక్కువ స్థానాలు కేటాయించాల ని ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీలు సీఎం కేసీఆర్‌ను కోరాయి.

ఆర్య వైశ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలి
నాయకులను కలిసిన ఆర్యవైశ్య ప్రతినిధులు

నల్లగొం డ , నవంబరు 18: జీహెచ్‌ఎంసీ ఎన్ని కల్లో ఆర్యవైశ్యులకు ఎక్కువ స్థానాలు కేటాయించాల ని ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీలు సీఎం కేసీఆర్‌ను కోరాయి. ఎమ్మె ల్సీ బొగ్గారపు దయానంద్‌, టూరిజం అభివృద్థి సం స్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, పరిశ్రమల అభివృద్థి సంస్థ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణలను జిల్లా కు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు బుధవారం హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కోటగిరి దైవాదీనం, ఐవీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పీఆర్‌వో పారెపల్లి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు లకుమారపు శ్రీనివాస్‌, బండారు వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి రాము, కర్నాటి నగేష్‌, గోవింద్‌, బాలరాజు, సతీష్‌కుమార్‌, వేణు ఉన్నారు. 


Updated Date - 2020-11-19T05:51:56+05:30 IST