ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు..
ABN , First Publish Date - 2020-03-25T14:51:00+05:30 IST
ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. జేసీ తన ఛాంబర్‌లో డీఆర్‌డీవో మందడి ఉపేందర్ రెడ్డి, డీసీవోటీ వెంకట్‌రెడ్డి,

భువనగిరి: ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. జేసీ తన ఛాంబర్‌లో డీఆర్‌డీవో మందడి ఉపేందర్ రెడ్డి, డీసీవోటీ వెంకట్‌రెడ్డి, పౌరసరఫరాల జీఎం గోపికృష్ణతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా రబీ 2019-20 ధాన్యం కొనుగోలు కార్యాచరణపై సమీక్షించారు. ప్రస్తుతం రబీలో జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నందున వ్యవసాయ శాఖ అంచనాల మేరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు సిద్దంగా ఉంచాలన్నారు. రబీ ధాన్య కొనుగోలుకు 120 పీఏసీఎస్, నాలుగు రైతు ఉత్పాదక సంఘాలు, 100కు పైగా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో ఏఎ్‌సవో బ్రహ్మారావు తదితరులు ఉన్నారు.