రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:35:29+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ కోరారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి
హుజూర్‌నగర్‌లో నినాదాలు చేస్తున్న రైతు సంఘాల నాయకులు

రైతు సంఘాల నాయకుల డిమాండ్‌

హుజూర్‌నగర్‌ / మేళ్లచెర్వు/ నడిగూడెం, డిసెంబరు 30: రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ కోరారు. హుజూర్‌నగర్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌ రైతు చట్టాలకు అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో యల్లావుల రాములు, పాలకూరి బాబు, బాదె నర్సయ్య, గుండు వెంకటేశ్వర్లు, వీరబాబు, హుస్సేన్‌ పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వట్టెపు సైదులు, మల్లికార్జున్‌ రావు, కె.వెంకన్న, కోటిరెడ్డి, రామయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, మధు ఉన్నా రు. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతుగా హైదరాబాదులో నిర్వహించిన ధర్నాకు నడిగూడెం రైతు సంఘాల నేతలు బుర్రి శ్రీరాములు, బెల్లంకొం డ సత్యానారాయణ, స్టాలిన్‌రెడ్డి, స్వరాజ్యం గురవయ్య తరలి వెళ్లారు. 


Updated Date - 2020-12-31T04:35:29+05:30 IST