నల్లగొండ కొవిడ్‌ వార్డులో మరొకరి మృతి

ABN , First Publish Date - 2020-07-20T11:04:51+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం కరోనా లక్షణాలతో మరో వ్యక్తి మృతి చెందాడు. కొవిడ్‌ వార్డుకు చేరిన రెండు గంటలకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

నల్లగొండ కొవిడ్‌ వార్డులో మరొకరి మృతి

నల్లగొండ అర్బన్‌, జూలై 19: ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం కరోనా లక్షణాలతో మరో వ్యక్తి మృతి చెందాడు. కొవిడ్‌ వార్డుకు చేరిన రెండు గంటలకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాలు వదిలాడు. మిర్యాలగూడ శెట్టిపాలెంకు గ్రామానికి చెందిన అతడు మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నల్లగొండ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుల సూచన మేరకు జనరల్‌ వార్డులో ఆడ్మిట్‌ అయ్యాడు. ఆదివారం ఉదయం తీవ్ర శ్వాస సమస్య తలెత్తడం, కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రి సిబ్బంది అతడిని కోవిడ్‌ వార్డుకు తరలించారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఆక్సిజన్‌ అందక శనివారం ఓ యువకుడు మృతి చెందగా, అతడి మృతదేహాన్ని కరోనా టెస్టు రిపోర్టు వచ్చే వరకు మార్చురీలోనే భద్రపరచనున్నారు.

Updated Date - 2020-07-20T11:04:51+05:30 IST