ప్రభుత్వ వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు

ABN , First Publish Date - 2020-11-27T06:09:56+05:30 IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు
కాంతారెడ్డి కుమారుడికి ఆర్థికసాయం అందజేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

రైతు కుటుంబానికి రూ.50వేలు అందజేత

 యాదాద్రి, నవంబరు26(ఆంధ్రజ్యోతి):  ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.  భువనగిరి మండలం సూరపల్లిలో పంట నష్టపోయిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు  సామా కాంతారెడ్డి కుటుంబాన్ని గురువారం పరామర్శించి ,రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ‘వర్షాలకు పంట నష్టపోయింది.  సీఎం సారూ ఆగమైతున్నాము.. ఆదుకోండి’ అని ఆ రైతు  20 రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో చివరికి ప్రాణాలనే తీసుకున్నాడన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా దాదాపు 60వేల ఎకరాల పంట నష్టం జరిగినా..ఇప్పటి వరకు నయాపైసా సాయం దక్కలేదన్నారు. రైతు కాంతారెడ్డి కుటుభానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన పంటలకు పరిహారం అం దించాలని, రంగుమారిన ఽధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read more