చేతులెత్తి మొక్కుతున్న..శ్వాస ఆడటం లేదు
ABN , First Publish Date - 2020-08-01T11:24:39+05:30 IST
నల్లగొండ జనరల్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహార శైలిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారి తీరు మాత్రం మారడం లేదు.

నల్లగొండ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి వేడుకోలు
ఓపీ సమయం ముగిసిందని పట్టించుకోని సిబ్బంది
నల్లగొండ అర్బన్, జూలై 31: నల్లగొండ జనరల్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహార శైలిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారి తీరు మాత్రం మారడం లేదు. నిడమనూరు మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ వారం రోజులు గా జర్వంతో ఇబ్బందిపడుతూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటోంది. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం తో గ్రామ సర్పంచ్ 108కు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన 108 వాహనంలో ఆమెను నల్లగొండ ఆస్పత్రికి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీసుకొచ్చారు. అయితే కరోనా ఓపీ సమయం ముగిసిందని, ఆసుపత్రి సిబ్బంది తలుపులు వేశారు. ఊపిరి ఆడటం లేదని ఆ వృద్ధురాలు చేతులెత్తి మొక్కినా ఫలితం లేకపోవడంతో ప్రాణాలు ఆరచేతపట్టుకుని ఆస్పత్రి ఆవరణలోనే రాత్రి వరకు అక్కడే ఉంది.