నిన్న అంబులెన్స్.. నేడు పాలవ్యాన్
ABN , First Publish Date - 2020-03-25T14:53:51+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన రాకపోకలపై నియంత్రణ కొనసాగుతోంది. దీంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఏ వాహన్నైనా ఆశ్రయించక తప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతిస్తున్న కొన్ని వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు వారి

సూర్యాపేట: లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన రాకపోకలపై నియంత్రణ కొనసాగుతోంది. దీంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఏ వాహన్నైనా ఆశ్రయించక తప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతిస్తున్న కొన్ని వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు వారి వాహనాల్లో గుట్టచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారు. సోమవారం కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద విజయవాడకు ప్రయాణికులను తీసుకెళ్తన్న ఐదు అంబులెన్స్‌ను సీజ్ చేయగా, తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి జనగాం వెళ్లే మార్గంలో పాల వ్యాన్‌లో ప్రయాణికులను తరలిస్తుండగా పోలీసులు సమాచారం అందుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అందులో 20 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.