నాణ్యత డొల్ల

ABN , First Publish Date - 2020-05-24T09:59:26+05:30 IST

ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం బయటపడుతోం ది. ఇందుకు గ్రామపంచాయతీలకు అందజేసిన నాసిరకం వాటర్‌ ట్యాంక ర్లే సాక్ష్యంగా

నాణ్యత డొల్ల

మాకొద్దని తిప్పిపంపిన సర్పంచ్‌లు

అన్నీ నాసిరకమని ఆరోపణ

జిల్లా స్టాండింగ్‌కమిటీలోనూ నాణ్యతపై ప్రశ్నించిన జడ్పీటీసీ


హుజూర్‌నగర్‌, మే 23 : ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం బయటపడుతోం ది. ఇందుకు గ్రామపంచాయతీలకు అందజేసిన నాసిరకం వాటర్‌ ట్యాంక ర్లే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లే వీటి నాణ్యతను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. నాసిరకం వాటర్‌ ట్యాంకర్లు మాకొద్దు బాబూ అంటూ సర్పంచ్‌లు రెండు నెలల్లోని వాటిని వెనక్కి పం పించారు. ఆ పార్టీ జడ్‌పీటీసీ సైతం శుక్రవారం సూర్యాపేటలో జరిగిన జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం లో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించారు. సుమారు రూ.25 లక్షల తో కొనుగోలు చేసిన వాటర్‌ ట్యాంకర్ల నాణ్యతా వివాదం ప్రస్తుతం దుమారం రేపుతోంది. పల్లెప్రగతి పథకంలో ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్లు అందజేసింది.


ట్రాలీ, ట్యాంకర్‌ కలిసి రూ.3లక్షల 50వేలకు కొటేషన్‌ ఇచ్చారు. హుజూర్‌నగర్‌ మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గాను లింగగిరి, అమరవరం, కరక్కాయలగూడెం, సీతారాంపురం, బూరుగడ్డ, శ్రీనివాసురం, లక్కవరం గ్రామాలకు వాటర్‌ ట్యాంకర్లు అందజేశారు. అవి కాస్తా రెండు నెలల్లోనే తుప్పుపట్టడంతో సర్పంచ్‌లు నివ్వెరపోయారు. ఈ నెల 20న హుజూర్‌నగర్‌లో జరిగిన మం డల పరిషత్‌ సమావేశం రోజే సర్పంచ్‌లు వాటర్‌ ట్యాంకర్లు తీసుకొచ్చి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వదిలి వెళ్ళారు. ఈ ఉదంతం సర్వత్రా చర్చకు దారితీసింది. దీంతో అధికారులు జిల్లా ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. దీనికి తోడు శుక్రవారం జిల్లా స్టాండింగ్‌ కమి టీలోనూ జడ్‌పీటీసీ కొప్పుల సైదిరెడ్డి వాటర్‌ ట్యాంకర్లలో డొల్లాతనాన్ని, అవినీతిని ప్రశ్నించారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల దుర్వినియోగంతో పాటు నాణ్యత లేని వాటర్‌ ట్యాంకర్లను అప్పగించడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సర్పంచ్‌ల స్పందనపై నివేదిక ఇచ్చా 

 హుజూర్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాలకు మంజూరు చేసిన వాటర్‌ ట్యాంకర్లను సర్పంచ్‌లు తిరిగి ఇచ్చే శారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. వారి ఆదేశాల మేరకే వాటర్‌ ట్యాంకర్లను సర్పంచ్‌లకు అందజేశాం. 

శంకరయ్య, ఎంపీడీవో  హుజూర్‌నగర్‌ 


నాణ్యత ఉన్న వాటర్‌ ట్యాంకర్లు అందించాలి 

సర్పంచ్‌లకు నాణ్యత కలిగిన వాటర్‌ ట్యాంకర్లను అందించాలి. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని మా ప్రభుత్వం సహించదు. కాంట్రాక్టర్‌౅ పౖ తగు చర్యలు తీసుకోవాలని జడ్‌పీ చైర్మన్‌ను కోరాం. తుప్పు పట్టిన  ట్యాంకర్లతో గ్రామాలలో నీటి సరపరా చేయలేని పరిస్థితి ఉంది.

కొప్పుల సైదిరెడ్డి,  జడ్పీటీసీ 

Updated Date - 2020-05-24T09:59:26+05:30 IST