సకల దేవతా స్వరూపిణి గోమాత

ABN , First Publish Date - 2020-12-18T05:21:48+05:30 IST

సకల దేవతా స్వరూపిణి గోమాత అని టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌ అన్నారు.

సకల దేవతా స్వరూపిణి గోమాత
పాదయాత్ర నిర్వహిస్తున్న శ్రీరామ్‌ సేన సభ్యులు

ఆలేరు, డిసెంబరు 17: సకల దేవతా స్వరూపిణి గోమాత అని టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌ అన్నారు. గోవును జాతీయప్రాణిగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీరామ్‌ సేన ఆలేరు నుంచి యాదగిరిగుట్ట వరకు చేపట్టిన పాదయాత్రను గురువారం ప్రారంభించి మాట్లాడారు. గోవు ఎక్కడ పూజించబడుతుందో అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందని తెలిపారు. గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా ఉన్న  కబేళాలను మూసి వేయాలని డిమాండ్‌చేశారు. శ్రీరామ్‌ సేన ఆధ్వర్యంలో గోరక్ష పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కరసేన అధ్యక్షుడు మైదం భాస్కర్‌, సభ్యులు గనగాని రాంచందర్‌, పాశికంటి సంపత్‌, కె సాయి, శరత్‌, భాను, అరవింద్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2020-12-18T05:21:48+05:30 IST