ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు : కంచర్ల
ABN , First Publish Date - 2020-12-11T06:19:43+05:30 IST
ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని హైదరాబాద్‌రోడ్ శ్రీలక్ష్మీ బాలాజీ నగర్‌లో గల హనుమాన్ ఆలయంలో విద్యారణ్యభారతి స్వామి ఆధ్వర్యంలో 11మంది వేదపండితుల మంత్రోచ్ఛారణలతో గురువారం శాస్త్రోక్తంగా హోమాలు, కలశాభిషేకం చేశారు.
నల్లగొండ కల్చరల్, డిసెంబరు 10 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని హైదరాబాద్‌రోడ్ శ్రీలక్ష్మీ బాలాజీ నగర్‌లో గల హనుమాన్ ఆలయంలో విద్యారణ్యభారతి స్వామి ఆధ్వర్యంలో 11మంది వేదపండితుల మంత్రోచ్ఛారణలతో గురువారం శాస్త్రోక్తంగా హోమాలు, కలశాభిషేకం చేశారు. కుంకుమ పూజలు నిర్వహించి యంత్ర, మూర్తిశిఖర, పంచము ఖ హనుమాన్ విగ్రహం, స్పటికలింగం, నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టించి ధ్వజస్తంభం నెలకొల్పారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హా జరై పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇష్టదైవాలను దర్శించుకుని భక్తితో పూజలు చేస్తే బాధలు తొలుగుతాయన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు ఊట్కూరి వెంకట్‌రెడ్డి, రావుల శ్రీనివా్‌సరెడ్డి, ఉత్సవ నిర్వహణ సభ్యుడు మందడి గోపాల్‌రెడ్డి, దోనాల నాగార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
16న క్రిస్మస్ దుస్తుల పంపిణీ
నల్లగొండ : పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి అధ్యక్షతన గురువారం క్రిస్మస్ సంబరాల నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 16వ తేదీన నియోజకవర్గంలోని పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ దుస్తులు పంపణీ చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తహసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, క్రిస్టియన్ ముఖ్యులు పాల్గొన్నారు.