అలంకారప్రాయమే

ABN , First Publish Date - 2020-11-21T06:37:50+05:30 IST

మరుగుదొడ్లు రెండు తప్ప, మిగతావి అలంకారప్రాయంగా మారాయి

అలంకారప్రాయమే
నల్లగొండ జిల్లాకేంద్రంలోని రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద తెరుచుకోని మరుగుదొడ్డి

రామగిరి, నవంబరు 20: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నల్లగొండ జిల్లాకేంద్రంలో ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన మరుగుదొడ్లు అలంకార ప్రాయంగా మారాయి. పట్టణ ప్రగతి  పథకం కింద ఒక్కో మరుగుదొడ్డికి సుమారు రూ.2లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో ఏడు మరుగుదొడ్లు నిర్మించారు. అయితే వాటిలో  రెండు తప్ప, మిగతావి  అలంకారప్రాయంగా మారాయి. నిర్మించిన వాటిలో  నీటి సౌకర్యం లేక  నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read more