స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-03T06:06:30+05:30 IST
వ్యవసాయరంగ అభివృద్ధికి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు అమలు చేయాలని ఆలిండియా కిసాన్ సంఘం జిల్లా నాయకుడు బంటు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏఐకేఎస్ జిల్లా నాయకుడు బంటు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ, డిసెంబరు 2 : వ్యవసాయరంగ అభివృద్ధికి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు అమలు చేయాలని ఆలిండియా కిసాన్ సంఘం జిల్లా నాయకుడు బంటు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకెఎస్సీసీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏఐకేఎస్, ఏఐకేఎఫ్, టీఎ్సకేఎస్, వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువుల ధర పెంపు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెట్టుబడి వ్యయం పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులపై సామినాథన్ కమిటీ సమగ్ర దర్యాప్తుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందన్నారు. కేంద్ర ప్రభు త్వం వాటి అమలుకు బదులు నూతన వ్యవసాయ చట్టాలతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఢిల్లీ సరిహద్దు రోడ్లపై ఏడు రోజులుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని పరిగనలోకి తీసుకుని తక్షణమే రైతాంగ వ్యతిరేక చటా ్టలు, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎఫ్ నా యకులు వస్కుల మట్టయ్య, ఎండీ.సయీద్, సైదమ్మ, బిల్ల కనకయ్య, ఆర్.జ్యోతి, ఎస్కె.నాగులు, గోపి పాల్గొన్నారు.