వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి : చైర్మన్
ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST
కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య అన్నారు.

కొండమల్లేపల్లి, డిసెంబరు 13 : కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఆమెను కమీషన్ ఏజెంట్లు, పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ లక్ష్మమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సలహా, సూచనల మేరకు దేవరకొండ, కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు మా ర్కెట్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పసునూరి యుగేంధర్‌రెడ్డి, శేఖర్, కాంశెట్టి శ్రీనివాసులు, బావుండ్ల దుర్గయ్య, స్వామి నందీశ్వర్, వర్కాల పాండు, చిలువేరు శ్రీనివాసులు, వెంకటరమణ, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.