డయాలసిస్ రోగులకు అధునాతన వైద్యం
ABN , First Publish Date - 2020-03-13T11:58:36+05:30 IST
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఈ వైద్యం అందుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండల్‌రావు అన్నారు.

నల్గగొండ అర్బన్, మార్చి 12: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఈ వైద్యం అందుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండల్‌రావు అన్నారు. గురువారం ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. డయాలసిస్ రోగులకు అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, శరీరంలో వ్యాధి లక్షణాలు కనపడితే నిరక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ వ్యాధిపై అవగాహన ఉండాలన్నారు. డయాలసిస్ యూనిట్‌లో అందుతున్న వైద్య చికిత్సలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడా లేని విధంగా సింగిల్ ఫిల్టర్ విధానం ద్వారా డయాలసిస్ చేయడం రోగులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.