రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-11-27T06:15:59+05:30 IST

చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

చౌటుప్పల్‌ రూరల్‌, నవంబరు 26: చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మండల పరిధిలోని జైకేసారం గ్రామానికి చెందిన సాల్వాది సాయిలు (80) చౌటుప్పల్‌కు వచ్చి తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైదరాబాద్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలకు గురైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.Read more