అభివృద్ధి పథకాలను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-11-21T06:01:42+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పథకాలను త్వరితగతిన పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌, హైదరాబాద్‌ డిప్యూటీ సీఈవో రాఘవేందర్‌రావు అన్నారు.

అభివృద్ధి పథకాలను త్వరగా పూర్తి చేయాలి
పథకాల పురోగతిపై సమీక్షిస్తున్న పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రాఘవేందర్‌రావు

పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రాఘవేందర్‌రావు 

భువనగిరి రూరల్‌, నవంబరు 20: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పథకాలను త్వరితగతిన పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌, హైదరాబాద్‌ డిప్యూటీ సీఈవో రాఘవేందర్‌రావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని పెంచికల్‌పహడ్‌, రామచంద్రాపురం, చందుపట్ల గ్రామాల్లో చేపడుతున్న శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్‌  యార్డు తదితర పథకాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. అభివృద్ధి పథకాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట భువనగిరి ఎంపీడీవో టి.నాగిరెడ్డి, ఎంపీవో అనురాధాదేవి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు భువనగిరి శ్రీనివాస్‌, చిన్నం పాండు, సిలివేరు పుష్పమ్మ ఎల్లయ్య, ఎంపీటీసీ బొక్క కొండల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 

Updated Date - 2020-11-21T06:01:42+05:30 IST