ఆదమరిస్తే.. అంతే..

ABN , First Publish Date - 2020-11-21T06:31:31+05:30 IST

ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా గండ్లు పడిన రహదారులు ప్రమాదకరంగా మారాయి.

ఆదమరిస్తే.. అంతే..
యాదాద్రిజిల్లా నాగిరెడ్డిపల్లి వద్ద చిట్యాల– ప్రజ్ఞాపూర్‌ ప్రధాన రహదారిపై ప్రమాదకర కయ్య

ప్రమాదభరితంగా ప్రధాన రహదారిపై గుంతలు 

యాదాద్రి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అది చిట్యాల– ప్రజ్ఞాపూర్‌ ప్రధాన రహదారి.. హైదరాబాద్‌– విజయవాడ, హైదరాబాద్‌– నాగ్‌పూర్‌ వంటి రెండు ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానం చేస్తాయి. నిత్యం వందలాది అంతర్‌రాష్ట్ర సరుకుల రవాణా భారీ వాహనాలు ఈ మార్గంలోనే వెళుతుంటాయి. అయితే  ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా గండ్లు పడిన రహదారులు ప్రమాదకరంగా మారాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో రహదారి పక్కనే పెద్దగుంతలో ఎప్పుడు, ఏ వాహనం పల్టీ కొడుతుందో  అనే రీతి ప్రమాదకరంగా మారింది. ఈ గుంత వద్దనే భారీవర్షాలు కురిసిన వరదనీటీలో ఖమ్మం జిల్లాకు చెందిన మోటార్‌సైకిల్‌ కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. అయితే భారీ వర్షాలు తగ్గి దాదాపు 20 రోజులు గడస్తున్నా.. ప్రధాన రహదారిపై ప్రమాదకరమైన రహదారి పక్కన కయ్యలకు మరమ్మత్తులు చేపట్టకపోవడం పట్ల వాహనదారుల్లో తీవ్ర  ఆందోళన వ్యక్తమవుతోంది. 


Read more