కార్గిల్ వీరులకు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-07-27T12:03:43+05:30 IST
భారత సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను బీజేపీ, పలు సంస్థలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఉమ్మడి

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్, జూలై 26: భారత సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను బీజేపీ, పలు సంస్థలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. త్రిపురారం మండలంలోని కొణతాలపల్లి గ్రామం లో కార్గిల్ యుద్ధవీరుడు మిట్టశ్రీనివా్‌సరెడ్డి విగ్రహం వద్ద సర్పంచ్ జొన్నలగడ్డ వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకులు కటకం మళ్లికార్జున్ ఆధ్వర్యంలో పలువురు నివాళులు అర్పించారు. దేవరకొండలో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యుద్ధవీరులకు నివాళులర్పించి, మాజీ సైనికులు బిక్కుమాళ్ల లక్ష్మినారాయణ, దేప వెంకటేశ్వరరెడ్డిని అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌వీటీ తదితరులు సన్మానించా రు. హుజూర్‌నగర్ మునిసిపల్ కార్యాలయంలో కార్గిల్ వీరులకు మునిసిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు నివాళులర్పించారు. భువనగి రి, వలిగొండలో నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మునిసిపల్ కౌన్సిలర్ మాయ దశరథ, బీజేపీ సీనియర్‌నేత లింగస్వామి పాల్గొన్నారు.