చెరువులో గల్లంతైన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-03-02T11:37:11+05:30 IST
మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో శనివారం రాత్రి చెరువులో గల్లంతైన సంగు సోమయ్య(60) మృతిచెందాడు. గొర్రెపిల్ల చెరువులో

గుండాల, మార్చి1: మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో శనివారం రాత్రి చెరువులో గల్లంతైన సంగు సోమయ్య(60) మృతిచెందాడు. గొర్రెపిల్ల చెరువులో పడగా దా న్ని కాపాడేందుకు వెళ్లి న సంగు సోమయ్య గల్లంతయ్యాడు. గ్రా మస్థులు శనివారం రాత్రి చెరువులో గాలించినా నీరు ఎక్కువగా ఉండడంతో ఆచూకి దొరకలేదు.
ఆదివారం తెల్లవారుజామున నుంచి తిరిగి గాలించగా మధ్యాహ్నానికి మృతదేహం లభించింది. మృతు డి కుటుంబానికి ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని సర్పంచ్ భిక్షమమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతిచెందిన గొర్రెల కాపరి కుటుంబానికి ప్రభుత్వం రూ.6లక్షల పరిహారం ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.