భయంకరోనా..ఒక్కరోజే 93 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-07-18T10:52:37+05:30 IST

కరోనా మ హమ్మారి విజృభింస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు

భయంకరోనా..ఒక్కరోజే 93 పాజిటివ్‌ కేసులు

రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ప్రారంభం


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 17: కరోనా మ హమ్మారి విజృభింస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 93పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 62, యాదాజ్రిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 12 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.ఇదిలా ఉండగా రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ప్రారంభం కాగా, ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


  • నల్లగొండ మునిసిపాలిటీ పరిధిలో 19వ వార్డులో, 12వ బెటాలియన్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. మిర్యాలగూడలో 16, దేవరకొండలో 7, చింతపల్లిలో 3, చిట్యాల, చండూరు, కేతపల్లి, అనుముల, నిడమనూరు మండలాల్లో ఒకటి చొప్పున ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
  • భువనగిరిలో మూడు, పోచంపల్లిలో ఐదు, తుర్కపల్లి, యాదగిరిగుట్టలో రెండు చొప్పున నాలుగు, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్‌, బీబీనగర్‌, మోత్కూర్‌లో ఒకటి చొప్పున ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏడు, మఠంపల్లిలో రెండు, హుజూర్‌నగర్‌, మునగాల, పెన్‌పహాడ్‌ మండలంలోని భక్తాళపురంలో ఒకటి చొప్పున మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
  • చండూరుకు చెందిన, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది.
  • చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన మహిళకు పాజిటివ్‌ వచ్చింది.
  • చౌటుప్పల్‌ పట్టణంలోని బంగారిగడ్డకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.
  • నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇటీవల పాజిటివ్‌తో మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది.
  • తిరుమలగిరి (సాగర్‌) మండలంలోని జువ్విచెట్టు తండాలో చెందిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
  • నాగార్జునసాగర్‌ జెన్‌కో కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. వీరు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
  • దేవరకొండ పట్టణంలో నాలుగు, ముదిగొండలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.
  • చింతపల్లి మండలంలోని నసర్లపల్లి రిజర్వాయర్‌ పనులు చేస్తున్న ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.
  • కొండమల్లేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది, కుటుంబ సభ్యులు నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.
  • నకిరేకల్‌లోని శివాజీనగర్‌కు చెందిన భార్యభర్తకు పాజిటివ్‌ వచ్చింది. కాగా, పట్టణంలో శనివారం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపార సంస్థలు తెరవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వ్యాపారులు తీర్మానించారు.
  • కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పాజిటివ్‌ వచ్చింది.
  • శాలిగౌరారం మండలంలోని జాలోనిగూడెం గ్రామానికి చెందిన 25ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. 
  • మేళ్లచెర్వు మండలంలోని రామాపురంలో ఒకరికి పాజిటివ్‌ రాగా, అతడి ప్రైమరీ కాంటాక్టులు 29 మందిని హోంక్వారంటైన్‌ చేశారు.
  • అర్వపల్లి తహసీల్దార్‌ కార్యాలయం, కొమ్మాల, వేల్పుచర్ల గ్రామాల్లో తాజాగా ముగ్గురికి పాజిటివ్‌ రాగా, హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
  • యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన మహిళ, బాహుపేట గ్రామానికి చెందిన మరొకరికి పాజిటివ్‌ వచ్చింది.
  • ఆత్మకూరు(ఎం) మండలంలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన 62వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.
  • కోదాడలోని భరత్‌నగర్‌, అనంతగిరి రోడ్డులో కేసులు పెరుగుతుండటంతో కాలనీలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు.
  • మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.
  • చిట్యాలలో ఈ నెల 20వ తేదీ నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపారాలు నిర్వహించేలా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
  • మునుగోడు మండల పరిధిలో వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించారు. నెలాఖరు వరకు మధ్యాహ్నం ఒంటిగంట తరువాత వ్యాపార సంస్థలు మూసివేసేలా తీర్మానించారు.
  • మిర్యాలగూడలో ఈనెల 20 నుంచి 31 వరకు  ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు మాత్రమే దుకాణాలు తెరిచేలా డీఎస్పీ వెంకటేశ్వరరావు, మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యాపారులు నిర్ణయించారు.

Updated Date - 2020-07-18T10:52:37+05:30 IST