60 కేజీల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-03-08T11:27:33+05:30 IST
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, 60కిలోల గంజాయిని, ఓ వాహనాన్ని

ముగ్గురు అరెస్టు, కారు స్వాధీనం
చౌటుప్పల్ రూరల్, మార్చి7: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, 60కిలోల గంజాయిని, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం జిల్లా మాడ్గుల మండలానికి చెందిన బొంజునాయుడు, సంతో్‌షకుమార్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన సుదర్శన్‌లు ముఠాగా ఏర్పడి గంజాయిని సరఫరాచేస్తున్నారు. హైదరాబాద్‌లోని కళాశాలలో విద్యార్థులకు, మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణాల్లోని విద్యార్థులకు విక్రయిస్తున్నారు.
శుక్రవారం విశాఖపట్టణం నుంచి కారులో హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గంజయిని తరలిస్తున్న కారును తనిఖీచేయగా, రూ.1.80లక్షల విలువైన 60కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అరెస్టు చేసి శనివారం రామన్నపేట కోర్టుకు రిమాండ్ పంపినట్లు ఆయన తెలిపారు.