ఐదు కేసులు నమోదు, రూ.లక్ష జరిమానా

ABN , First Publish Date - 2020-03-25T14:25:53+05:30 IST

తూనికలు కొలతల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసగిస్తున్న వ్యాపారులపై తూనికలు కొలతల శాఖాధికారులు కొరడా ఝలిపించారు. తక్కువ తూకాలు, ప్యాకేజీలపై మ్యాన్‌ఫ్యాక్చర్‌ అప్‌గ్రేడ్‌ నమోదు వంటివి సరిగా చూపించని వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వినియోగదారుల...

ఐదు కేసులు నమోదు, రూ.లక్ష జరిమానా

 నల్లగొండ, మార్చి 24 : తూనికలు కొలతల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసగిస్తున్న వ్యాపారులపై తూనికలు కొలతల శాఖాధికారులు కొరడా ఝలిపించారు. తక్కువ తూకాలు, ప్యాకేజీలపై మ్యాన్‌ఫ్యాక్చర్‌ అప్‌గ్రేడ్‌ నమోదు వంటివి సరిగా చూపించని వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు లీగల్‌ మెట్రాలజీ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ పి. రామకృష్ణ నేతృత్వంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌, దేవరకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లోని పలు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు దుకాణాల్లో వ్యాపారులు అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించి ఐదు కేసులు నమోదు చేశారు. ఇందులో తక్కువ తూకం చేస్తున్నారంటూ కేసు నమోదు కాగా వస్తువుల ప్యాకింగ్‌పై ఎంఆర్‌పీ, తయారైన తేదీ, కస్టమర్‌కేర్‌ నెంబరు వంటి వివరాలు సరిగా లేకపోవడంతో మ రో నాలుగు కేసులను నమోదు చేశారు. ఈ ఐదు కేసులకు గానూ సదరు వ్యాపారులపై లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. వ్యా పారులెవరైనా అధిక ధరలకు విక్రయాలు జరిపితే కఠి న చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్యాకేజీ వస్తువులపై విధిగా తయారీ తేదీ, ఎంఆర్‌పీ తదితర వివరాలు పొందుపర్చాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో సిబ్బంది గిరి, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T14:25:53+05:30 IST