ఉమ్మడి జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-07-08T10:05:47+05:30 IST

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ :ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఒక్కరోజు 39పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. నల్లగొండ జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు

ముగ్గురు మృతి


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ :ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఒక్కరోజు 39పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. నల్లగొండ జిల్లాలో 25, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి జిల్లాలో 5 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.కాగా, యాదాద్రి జిల్లాలో ముగ్గు రు పాజిటివ్‌తో చికిత్స పొందుతూ మృతిచెందారు.


నల్లగొండ పట్టణంలో ఎనిమిది పాజిటివ్‌ కేసులు వచ్చాయి. హాలియా మండలంలో నాలుగు, కొం డమల్లేపల్లి ఒకరికి, చింతపల్లిలో ఇద్దరికి, నార్కట్‌పల్లిలో ఒకరు, చండూరులో ఒకరు, మిర్యాలగూడలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


చింతపల్లి మండలం వీటీనగర్‌లో మంగళవారం మరో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటీనగర్‌లో ఓ వ్యాపారవేత్తకు చెందిన కుటుంబసభ్యుల్లో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. వారం తా హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కాలనీకి చెందిన మరో ఇద్దరు యువకులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కాగా, ఇప్పటి వరకు ఒక్క వీటీనగర్‌లో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదుకావడం, ఒకరు మృతి చెం దడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మంగళవారం స్థానిక వ్యాపార, వాణిజ్య కేంద్రాలను మూసివేసి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించారు.


నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 13వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, విధుల్లో అతడి కాలికి గాయమైంది. సెలవుపై ఇంటికి వచ్చి విధుల్లో చేరేందుకు వెళ్లేముందు హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబసభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు. కాగా, గ్రామంలో పాజిటివ్‌ రావడంతో కొన్ని రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని గ్రామస్థులు నిర్ణయించారు.


పెద్దవూర మండలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో 15 రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అతడికి పాజిటివ్‌ రావడంతో నల్లగొండకు తరలించారు. ఇదిలా ఉండగా, గుర్రంపోడు మండలం తేరాటిగూడెం గ్రామానికి చెందిన పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మండలంలోని వెల్మగూడెం గ్రామానికి చెందిన ఓ ఆర్‌ఎంపీ చికిత్స చేయగా, అతడిని హోంక్వారంటైన్‌ చేసి పరీక్షల కోసం స్వాబ్‌ నమూనాలను వైద్యసిబ్బంది సేకరించారు.


హాలియా మునిసిపాలిటీలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పేరూరు రోడ్డులో ఇటీవల ఒకరు పాజిటివ్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌ చేసి నమూనాలను పరీక్షలకు పంపగా, నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం ఠాగూర్‌ రోడ్డుకు చెందిన ఒకరు కరోనా పాజిటివ్‌ తో గాంధీ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.


వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స పొందు తూ మృతి చెందాడు. గత నెల 29న డయాలసిస్‌ కోసం అతడు హైదరాబాద్‌లో ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన ఓ యువకుడు పాజిటివ్‌తో పదిరోజులుగా హైదరాబాద్‌లో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


చౌటుప్పల్‌ హ్యాండ్లూమ్‌ మార్కెట్‌లోని 60 ఏళ్ల చేనేత వ్యాపారికి పాజిటివ్‌ వచ్చింది. అతడిని హోంక్వారంటైన్‌ చేసి చికిత్స చేస్తున్నారు. కాగా, మార్కెట్‌ వీధిలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.


రామన్నపేట మండల కేంద్రంలో దంపతులకు పాజిటివ్‌ వచ్చింది. వీరు గత నెల 25వ తేదీన హైదరాబాద్‌ వెళ్లడంతో వైర్‌సబారిన పడినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌ లో చికిత్స పొందుతున్నారు.


సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం అతడి భార్యకు పాజిటివ్‌గా రాగా, ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇతడిని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా 15మందిని హోంక్వారంటైన్‌ చేశారు. 


సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న అతడు సోమవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగిన 15మందిని అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు. 


సూర్యాపేట జిల్లాలో మరో ఏడుగురికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చికాంపౌండ్‌లో ఇద్దరికి, తాళ్లగడ్డకు చెందిన ఒకరికి, రామలింగేశ్వర థియేటర్‌ ప్రాం తంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా అర్వపల్లి మండల కేంద్రంలో ఒకరికి, హుజూర్‌నగర్‌లో మరొకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌ పాత రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రోడ్డులో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మునిసిపల్‌ సిబ్బంది కాలనీలో శానిటైజేషన్‌ చేశారు.


పెన్‌పహాడ్‌ మండలంలోని దోసపహాడ్‌ గ్రామం లో 38 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఇతడు ఇటీవల మిర్యాలగూడెంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనగా, కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో అతడికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా గ్రామానికి చెందిని ఎనిమిది మందికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని సైతం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. వీరి వైద్య పరీక్షల ఫలితాలు బుధవారం రానున్నాయి.


హుజూర్‌నగర్‌లో పోలీస్‌ శాఖలో పనిచేసే ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పట్టణంలో పాజిటి వ్‌ కేసులు నమోదువుతుండటంతో మంగళవా రం 12 వైద్య బృందాలు 450 ఇళ్లలో ఆరోగ్య సర్వే చేశారు.

Updated Date - 2020-07-08T10:05:47+05:30 IST