ఉమ్మడి జిల్లాలో 382 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-10-03T10:41:54+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 382 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 382 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 2: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 382 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 236, సూర్యాపేటలో 61, యాదాద్రి జిల్లాలో 85 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో గురువారం 460 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో 220 కేసులే చూపింది. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన రాపిడ్‌ పరీక్షల్లో భువనగిరి 29, నకిరేకల్‌, వలిగొండ 15 చొప్పున, దేవరకొండ, మిర్యాలగూడ 14 చొప్పున, హాలియా, సూర్యాపేట 12 చొప్పున, చౌటుప్పల్‌ 11, తిరుమలగిరి, తుంగతుర్తి 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యా యి.


త్రిపురారం, మోత్కూరు తొమ్మిది చొప్పున, శాలిగౌరారం, నేరేడుచర్ల ఎనిమిది చొప్పున, దామచర్ల, నాంపల్లి, నార్కట్‌పల్లి, కోదాడ ఏడు చొప్పున, నాగార్జునసాగర్‌, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి ఆరు చొప్పున, అడవిదేవులపల్లి, డిండి, నిడమనూరు, ఆలేరు, అనంతగిరి, మఠంపల్లి, నడిగూడెం ఐదు చొప్పున పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కొండమల్లేపల్లి, కట్టంగూరు, చివ్వెంల, పెన్‌పహాడ్‌, మోతె నాలుగు చొప్పున, చింతపల్లి, చందంపేట, చిలుకూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మూడు చొప్పున, ఆత్మకూరు(ఎం), యాదగిరిగుట్ట, పీఏపల్లి రెండు చొప్పున, పాలకవీడు, మేళ్లచెర్వు, ఆత్మకూరు(ఎస్‌), కేతేపల్లి, మునుగోడు, బొమ్మలరామారం, రాజాపేట, సంస్థాన్‌నారాయణపురం ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-10-03T10:41:54+05:30 IST