రూ.1.20 లక్షల విలువైన 12 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-21T06:29:36+05:30 IST

గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని సూర్యా పేట రూరల్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి రూ.1.20 లక్షల విలు వైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

రూ.1.20 లక్షల విలువైన 12 కిలోల గంజాయి స్వాధీనం
సూర్యాపేటలో కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మోహన్‌కుమార్‌

గంజాయి తరలిస్తున్న ఒకరి అరెస్టు 

సూర్యాపేటరూరల్‌, నవంబరు 20: గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని సూర్యా పేట రూరల్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి రూ.1.20 లక్షల విలు వైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  శుక్రవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డీఎస్సీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..  పెన్‌పహడ్‌  మండలం లాల్‌సింగ్‌ తండాకు భూక్య రాము సూర్యాపేట వైపు కారులో వస్తుండగా ఇమాంపేట శివారులో పోలీసులు  తనిఖీ చేశారు.  కారులో  ఆరు ప్యాకెట్లలో ఉన్న రూ.1.20 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఏపీ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా దారకొండ నుంచి గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రలో విక్రయించడానికి తీసుకు వెళుతున్నట్లు రాము అంగీకరించాడు.  నిందితుడిపై  కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ  చూపిన సీసీఎస్‌ సీఐ నిరంజన్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బందిని డీఎస్పీ ఆభినందించారు.  సమావేశంలో సీఐ విఠల్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది నర్సింహారావు, రమేష్‌, రవీందర్‌రెడ్డి, శివరాం, వెంకన్న అస్గర్‌అలీ, శ్రీరాములు పాల్గొన్నారు. 


యువతిని కిడ్నాప్‌ చేశారని డయల్‌ 100కు ఫిర్యాదు

మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు 

కోదాడ రూరల్‌, నవంబరు 20: కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రా మానికి చెందిన కారం రత్తయ్య కుమార్తె కావ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆమె కుటుంబసభ్యులు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు.  పోలీ సులు వెంటనే స్పందించి మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా కావ్య నల్లబండగూడెం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళుతున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి స్టేజీ వద్ద బస్సును పోలీసులు ఆపి కావ్యను అదుపులోకి తీసుకున్నారు. కోదాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల సమక్షంలో కావ్యకు కౌన్సెలింగ్‌ ఇచ్చి అప్పగించినట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసులు తెలిపారు.  ఈ సంద ర్భంగా కావ్య మాట్లాడుతూ తనన ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తల్లిదండ్రులపై కోపంతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌లో ఉంటున్న  పిన్ని రజిని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశానని తెలిపింది. డయల్‌ 100కు ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. 


రైతు బలవన్మరణం

అనంతగిరి, నవంబరు 20: మండలంలోని గోండ్రియాల గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండ్రియాల గ్రామానికి చెందిన గూటు బిక్షమయ్య (49)కు వ్యవసాయంలో అప్పులు కావ డంతో కుటుంబంలో గొడవలు అయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన బిక్షమయ్య  గ్రామ శివారులోని సొంత పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిక్షమయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

Read more