ఉమ్మడి జిల్లాలో 1,112 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-06T10:32:54+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం 1,112 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 1,112 పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 5: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం 1,112 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 546, సూర్యాపేటలో 291, యాదాద్రి జిల్లాలో 275 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, వేములపల్లి మండలంలో ఒకరు కరోనాతో మృతిచెందారు.  హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ఎనిమిది నెలల బాబుకు కరోనా వచ్చింది. అదేవిధంగా మోత్కూరులో తొమ్మిడి నెలల నిండు గర్భిణికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఆయన సతీమణి నాగమణికి పాజిటివ్‌ వచ్చింది.


వీరు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శాలిగౌరారం మండల కేంద్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 6 నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు మొత్తం నెల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్న సర్పంచ్‌ భట్ట హరితవీరబాబు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 1150 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శనివారం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్‌లో మాత్రం కేవలం 344 పాజిటివ్‌ కేసులు చూపారు. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాపిడ్‌ పరీక్షల్లో మిర్యాలగూడ 44, మోత్కూరు, భువనగిరిలో 43 చొప్పున, నకిరేకల్‌ 42, ఆలేరు 40, చిట్యాల 35, నేరేడుచర్ల 34, చౌటుప్పల్‌ 33, రామన్నపేట 26, చండూరు, పెన్‌పహాడ్‌లో 25 చొప్పున, కట్టంగూరు 24, కోదాడ, నార్కట్‌పల్లి, మునుగోడులో 23 చొప్పున, చివ్వెంల 22, చింతపల్లి 20 చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. పెద్దవూర, సూర్యాపేట, వలిగొండ, శాలిగౌరారం, మునగాలలో 19 చొప్పున, ఆత్మకూరు(ఎస్‌) 18, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌లో 17చొప్పున, నడిగూడెం, తుంగతుర్తి, నిడమనూరులో 16చొప్పున, కేతేపల్లి, కొండమల్లేపల్లి, మఠంపల్లిలో 14 చొప్పున, హాలియా, పీఏపల్లి, భూదాన్‌పోచంపల్లి, రాజాపేటలో 13 చొప్పున, మోతె, మేళ్లచెర్వు, సంస్థాన్‌నారాయణపురంలో 12 చొప్పున, బీబీనగర్‌, దామచర్లలో 11 చొప్పున, దేవరకొండ, త్రిపురారంలో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


మాడ్గులపల్లి తొమ్మిది, తుర్కపల్లి, యాదగిరిగుట్టలో ఎనిమిది చొప్పున, నల్లగొండ ఏడు, గుర్రంపోడు, మద్దిరాల, నాగార్జునసాగర్‌లో ఆరు చొప్పున, అడవిదేవులపల్లి, చిలుకూరు, అనంతగిరి, ఆత్మకూరు(ఎం), నూతనకల్‌లో ఐదు చొప్పున, పాలకవీడు, బొమ్మలరామారం, తిరుమలగిరిలో నాలుగు చొప్పున, డిండి, అడ్డగూడూరు, నాగారం, నాంపల్లి, గుండాలలో మూడు చొప్పున, మర్రిగూడ, తిరుమలగిరి(సాగర్‌), అర్వపల్లిలో రెండు చొప్పున, మోటకొండూరులో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-06T10:32:54+05:30 IST