ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-27T05:34:16+05:30 IST

రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బైక్‌తో ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు.

ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని యువకుడి దుర్మరణం


హత్నూర, డిసెంబరు 26: రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బైక్‌తో ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. ముచ్చర్ల గ్రామానికి చెందిన చీమల చిత్తం(38) అతడి బంధువు నర్సింహులు, కాంతమ్మతో కలిసి బైక్‌పై  స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ముచ్చర్ల గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బైక్‌తో ఢీనడంతో చిత్తం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నర్సింహులు, కాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2020-12-27T05:34:16+05:30 IST