రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-19T05:41:14+05:30 IST
జహీరాబాద్‌లోని మాణిక్‌ప్రభు మహెలాకు చెందిన అరుణ్‌కుమార్ అలియాస్, బాబా(22) శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్ సమీపంలోగల రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వేపోలీసులు తెలిపారు.

జహీరాబాద్, డిసెంబరు 18: జహీరాబాద్‌లోని మాణిక్‌ప్రభు మహెలాకు చెందిన అరుణ్‌కుమార్ అలియాస్, బాబా(22) శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్ సమీపంలోగల రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వేపోలీసులు తెలిపారు. వారికథనం ప్రకారం.. అరుణ్‌కుమార్‌కు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వేపోలీసులు తెలిపారు.