అఖ్తర్‌ఖాన్‌కు యంగ్ అచీవర్స్ అవార్డు
ABN , First Publish Date - 2020-12-17T05:46:47+05:30 IST
పటాన్‌చె రు రూరల్, డిసెంబరు 16 : న్యూఢిల్లీలోని సీఎ్‌సఆర్ టైమ్స్‌కు చెందిన ఇండియన్ అచీవర్స్ ఫోరమ్ బుధవారం హైదరాబాద్-గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ అఖ్తర్ ఖాన్‌కు యంగ్ అచీవర్స్ అవార్డు-2020ను ఇచ్చి సత్కరించింది.

పటాన్‌చె రు రూరల్, డిసెంబరు 16 : న్యూఢిల్లీలోని సీఎ్‌సఆర్ టైమ్స్‌కు చెందిన ఇండియన్ అచీవర్స్ ఫోరమ్ బుధవారం హైదరాబాద్-గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ అఖ్తర్ ఖాన్‌కు యంగ్ అచీవర్స్ అవార్డు-2020ను ఇచ్చి సత్కరించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన విజయాలు, సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ప్రముఖ సంస్థలు, వివిధ రంగాలోని నిపుణులతో పాటు అఖ్తర్‌ఖాన్ ఈ అవార్డును అందుకున్నారు. తనకు మార్గదర్శనం వహించడంతో పాటు అన్నివిధాల సహాయ సహకారాలు అందజేస్తున్న గీతం మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చిన్మయపాడికి ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మేటి పనితీరుతో అటు బోధనా రంగంలో రాణించడంతో పాటు ఇటు దేశవ్యాప్త గుర్తింపునిచ్చే అవార్డును అందుకున్న అఖ్తర్ ఖాన్‌ను గీతం హైదరాబాద్ క్యాంపస్ ప్రొవీసీ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎ్‌సఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, ఏరోస్పేస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి తదితరులు అభినందించారు.