నిత్యజీవితంలో యోగా తప్పనిసరి

ABN , First Publish Date - 2020-06-22T11:43:08+05:30 IST

యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, రోగనిరోధకశక్తి కూడా పెంపొందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

నిత్యజీవితంలో యోగా తప్పనిసరి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం


సిద్దిపేట, జూన్‌ 21 : యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, రోగనిరోధకశక్తి కూడా పెంపొందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బిజీలై్‌ఫలో సెల్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారిందని, అలాగే యోగాను కూడా ప్రతిరోజు చేయాలని కోరారు.15 రోజుల పాటు యోగా సాధన చేసి ఫలితాలు పొందొచ్చని, వాటిని అలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా యోగా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన యోగాసనాలు వేశారు. ప్రాణాయామం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యోగా ప్రాణయామం ద్వారా ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందుతుందని చెప్పారు. యోగా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కరోనాలాంటి వ్యాధులను ఎదుర్కోవడం సులభతరమవుతుందని చెప్పారు. శ్రీరాముడి కాలం నుంచే సూర్యనమస్కాలు చేసేవారని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్న వారే అన్ని రకాలుగా భాగ్యవంతులని చెప్పారు. జీవితం విలువైనదని దాన్ని రోగాల బారి నుంచి రక్షించుకుని ఉన్నతంగా మెలగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్‌  ప్రతినిధులు తోట సతీష్‌, కొమురవెల్లి అంజయ్య, నిమ్మ శ్రీనివా్‌సరెడ్డి, చిప్ప ప్రభాకర్‌, విక్రంరెడ్డి, బొజ్జ అశోక్‌, రాము తదితరులు పాల్గొన్నారు. 


యోగా రక్షణ కవచం

కరోనాలాంటి మహమ్మారీలను ఎదుర్కోవడానికి యోగా రక్షణ కవచంగా నిలుస్తుందని యోగా గురువులు, సాధకులు అన్నారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్‌, వ్యాస మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కోమటి చెరువుపై నిరాడంబరంగా యోగా వేడుకలు నిర్వహించారు. యోగా గురువు, జాతీయ యోగా అవార్డు గ్రహీత తోట సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సూర్యనమస్కారాలు, ఆసనాలు, ప్రాణయామం, ధ్యానం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు ఓఎ్‌సడీ బాలరాజ్‌, రాష్ట్రమీడియా అకాడమీ మాజీ  సభ్యుడు కె.అంజయ్య, యోగా సంఘాల ప్రతినిధులు  తోట అశోక్‌, నిమ్మ శ్రీనివా్‌సరెడ్డి , చిప్ప ప్రభాకర్‌, విక్రమ్‌రెడ్డి, బొజ్జ అశోక్‌, లింగమూర్తి, రాము, సంధ్య తదితరులు పాల్గొన్నారు 


యోగాతో ఆరోగ్యం

గజ్వేల్‌ : యోగాను ఆచరించి ఆరోగ్యాన్ని పొందుదామని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అన్నారు. నెహ్రూ యువకేంద్ర, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఆయన వెంట పతాంజలి యోగా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రంగాచారి, జయలక్ష్మి, డాక్టర్‌ నరేశ్‌బాబు, కొట్టాల యాదగిరి, నర్సింలు, కుమారస్వామి తదితరులున్నారు. 


యోగా కనిపించని ఔషధం

హుస్నాబాద్‌రూరల్‌ /హుస్నాబాద్‌ : యోగా కనిపించని ఔషధం లాంటిదని ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతతకు ఆసనాలు వేయాలని  యోగ సాధకులు పేర్కొన్నారు. విశ్వంభర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగంపెల్లి రఘు సారథ్యంలో మాస్టర్‌ పోలోజు కృష్ణమాచారి ఆసనాలు వేశారు. కార్యక్రమంలో సిద్దార్థ స్కూల్‌ హెచ్‌ఎం నర్సింహరెడ్డి, చందుల వీరసోమయ్య, చిట్టిగోపాల్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌లో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత తన స్వగృహంలో యోగాసనాలు వేశారు. బీజేపీ నాయకులు వారి వారి ఇళ్లలో యోగాసనాలు వేశారు. 


ప్రతి ఒక్కరూ యోగా చేయాలి    

సిద్దిపేట క్రైం/సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండ్ల జనార్దన్‌, పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్‌ యాద వ్‌, మహిపాల్‌రెడ్డి, కోడూరి నరేష్‌, రామచంద్రారెడ్డి, తాటికొండ శ్రీనివాస్‌, మల్లంగారి శ్రీను, నగేష్‌  పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో  నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్‌ బెన్సీసీ, యోగా శిక్షకులు లక్ష్మణ్‌, లింగం, విజయ్‌సాయి, వంశీ, పవన్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-22T11:43:08+05:30 IST